: ఇదొక మిరాకిల్: ‘బాహుబ‌లి 2’ పై టాలీవుడ్ యంగ్ హీరోలు


దర్శకధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాపై టాలీవుడ్ నటులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాహుబలిని తెరకెక్కించిన తీరుపై తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. యంగ్ హీరోలు అక్కినేని అఖిల్‌, సాయిధ‌ర‌మ్‌తేజలు ఈ సినిమాపై స్పందిస్తూ.. రాజ‌మౌళి సహా బాహుబలి చిత్ర బృందం ఇండియ‌న్ సినిమాను బాహుబ‌లికి ముందు, బాహుబ‌లి త‌ర్వాత అంటూ మాట్లాడే స్థాయికి తీసుకెళ్లార‌ని, ఇదొక మిరాకిల్ అని అన్నారు. మ‌రోవైపు బాహుబ‌లి ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న థియేట‌ర్ల ముందు అభిమానుల కోలాహ‌లం క‌న‌బ‌డుతోంది. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడో తెలుసుకున్న అభిమానులు త‌మ‌కు గొప్ప ర‌హ‌స్యం తెలిసిపోయిందంటూ కేరింత‌లు కొడుతూ పండుగ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News