: గొర్రెలు, చేపలు తప్ప కేసీఆర్ ప్రసంగంలో మరేమీ లేదు: రేవంత్ రెడ్డి
వరంగల్ లో జరిగిన టీఆర్ఎస్ సభ పస లేకుండా సాగిందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో గొర్రెలు, చేపలు, కరెంటు తప్ప... జనాలను ఆకర్షించే ఏ అంశమూ లేదని అన్నారు. రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... ఆ విషయంపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ చదువు, ఇంటికో ఉద్యోగం, దళితులకు భూమి అంశాలను కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. చప్పట్లు కొట్టాలంటూ కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా... జనాల నుంచి స్పందనే రాలేదని ఎద్దేవా చేశారు.