: మరో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు
మావోయిస్టుల మారణ హోమం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భారీ సంఖ్యలో సీఆర్ఫీఎఫ్ జవాన్లను మట్టు బెట్టిన మావోలు ఇప్పుడు మరో ఇద్దరిని హతమార్చారు. ఒడిశాలోని మల్కన్ గిరి ప్రాంతంలోని సుధాకొండ గ్రామంలో ఇన్ఫార్మర్లు అనే నెపంతో బిసు కిర్సాని, రామా పదియాని అనే ఇద్దరిని కాల్చి చంపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.