: కొడనాడులోని జయ, శశికళ గదుల్లో చోరీ
కొడనాడులోని జయలలిత ఎస్టేట్ లో చోరీ జరిగింది. ఎస్టేటులో ఉన్న జయలలిత, శశికళ గదుల్లో చోరీ జరిగిందని పోలీసులు గుర్తించారు. 50 మంది పోలీసులతో కూడిన బృందం జయ ఎస్టేట్ లో తనిఖీలు నిర్వహించింది. ఈ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ చోరీ విషయం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. అయితే, ఏమేం చోరీ అయ్యాయో ఇంతవరకు బయటకు రాలేదు.