: సమంత ట్విట్టర్ ఖాతా శుభాకాంక్షలతో మోతెక్కిపోతోంది...తొలి విష్ రకుల్ ప్రీత్ దే!


టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ట్విట్టర్ ఖాతా శుభాకాంక్షలతో మోతెక్కిపోతోంది. ఏప్రిల్‌ 28న ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె సన్నిహితులు, బంధువులు శుభాకాంక్షలు చెబుతున్నారు. నేటి ఉదయం  నుంచి ఆమె ట్విట్టర్ ఖాతాకు శుభాకాంక్షల సందేశాలు పోటెత్తుతున్నాయి. రెండు సినీ పరిశ్రమల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా ఉండడంతో రెండు సినీ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వాటిని అందుకుని, ధన్యవాదాలు తెలపడంలో సమంత బిజీగా ఉంది. అభిమానులతో పాటు క్రేజీ హీరోయిన్‌ రకుల్, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 





  • Loading...

More Telugu News