: ఆన్ లైన్ లో లీకైన బాహుబలి 2.... తొలి 50 నిమిషాల సినిమా లీక్!


భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలో ఏ సినిమాకు లేని విధంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. బెనిఫిట్ షోతో విడుదలైన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' కు పాజిటివ్ టాక్ రాగా, సినిమా మొదటి భాగం ఆన్ లైన్ లో లీకైనట్టు తెలుస్తోంది. 50 నిమిషాల నిడివిగల తొలి భాగాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా పైరసీపై చిత్ర యూనిట్ ముందుగానే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేగంగా స్పందించిన పోలీసులు దానిని తొలగించి, ఈ 50 నిమిషాల నిడివి సినిమాను ఎవరు లీక్ చేశారన్నది కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే బెనిఫిట్ షో సమయంలోనే దీనిని షూట్ చేసి, ఆన్ లైన్ లో పెట్టారని గుర్తించారు. ఈ లీక్డ్ వీడియోకు డౌన్ లోడ్ సౌకర్యం కూడా కల్పించడంతో దీనిని చాలా మంది డౌన్ లోడ్ చేసుకున్నారని సైబర్ క్రైం విభాగం అనుమానిస్తోంది. దీనిని వాట్స్ యాప్ లో ఎంత మంది షేర్ చేసుకుంటారోనని చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. 

  • Loading...

More Telugu News