: జేఈఈ మెయిన్స్ లో వంద శాతం మార్కులు.. రికార్డు సృష్టించిన కల్పిత్!
జేఈఈ మెయిన్స్ పరీక్షలో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు కల్పిత్ వీరవల్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్ ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 360కి 360 మార్కులు సాధించి గర్వకారణంగా నిలిచాడు. కల్పిత్ తండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తుండగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్. రోజూ 4-5 గంటలు చదవడమే తన విజయ రహస్యమని కల్పిత్ చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్టు పేర్కొన్నాడు. మంచి మార్కులు వస్తాయన్న విషయాన్ని ఊహించాను కానీ, ఇలా మొత్తం మార్కులు వస్తాయని ఊహించలేదన్నాడు. కల్పిత్ సాధించిన ఘనతకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.