: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెండి కిరీటం చేయించిన కార్పొరేటర్!
హన్మకొండలో టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభ ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ చేరుకున్నారు. కాగా, ఈ సభలో కేసీఆర్‌కు వెండి కిరీటం బహూకరించనున్నట్లు మలక్‌పేట కార్పొరేటర్ శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. హన్మకొండలో ప్రారంభమైన 'ప్రగతి నివేదన సభ' వేదిక వద్దకు తాను చేయించిన వెండి కిరీటాన్ని తీసుకువచ్చిన ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌కు వెండి కిరీటాన్ని ఇచ్చి, కరవాలంతో సత్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆయన వెన్నంటి నడుస్తున్నాయని అన్నారు.