: కళ్లుండీ చూడలేని కబోదులు విపక్షాలు: మంత్రి ఈటల
మూడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏం అభివృద్ధి సాధించిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాజేందర్ స్పందించారు. ‘కళ్లుండీ చూడలేని కబోదులు.. విపక్షాలు’, ‘ఊరంతా ఒకే దారి వెళితే.. విపక్షాలు మరో దారిలో పయనించడం దౌర్భాగ్యం’ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాల ప్రశ్నకు.. ‘తెలంగాణలో 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నాము’ అనే ఒక్క సమాధానం చాలని అన్నారు.