: దినకరన్ భార్యను కూడా ప్రశ్నించనున్న ఢిల్లీ పోలీసులు
రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఆయనను తదుపరి విచారణ కోసం చెన్నై తీసుకొచ్చారు. ప్రస్తుతం దినకరన్ ను చెన్నైలోని ఓ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన భార్యను కూడా ఢిల్లీ పోలీసులు విచారించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె జయ టీవీ బాధ్యతలను చూస్తున్నారు.