: కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు వెళతావ్: సుబ్రతా రాయ్ కి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్
సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15వ తేదీ నాటికి షూరిటీ కింద రూ. 2,500 కోట్లు చెల్లించాలని... లేకపోతే, మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. గడువులోగా చెల్లింపులు జరగాలని.. చెక్ బౌన్స్ అయితే కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది. చెల్లించడానికి డబ్బు లేకపోతే అంబీ వ్యాలీని వేలం వేయాలని ఆదేశించింది. 2014లో అరెస్టైన సుబ్రతా రాయ్ గత ఏడాది బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.