: 'శ్రీమంతుడు' సినిమాలో అందుకే నటించలేదు: నటి సుధ


తల్లి పాత్రలంటే ఠక్కుమని గుర్తొచ్చే ఆర్టిస్ట్ సుధ. తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలామె. ప్రస్తుతం ఆమె సినిమాలను తగ్గించుకుంటోంది. దీనిపై ఆమె స్పందిస్తూ, ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లన్నీ ఓ ప్రాపర్టీలా మారిపోయాయని చెప్పింది. డైలాగులు కూడా లేకుండా ఏదో ఒక పక్కన నిలబడే క్యారెక్టర్లే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మహేష్ బాబు సినిమా 'శ్రీమంతుడు' కూడా ఈ కారణంగానే వదులుకున్నానని చెప్పింది. ఈ సినిమాలో మహేష్ తల్లి పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని... అందుకే వద్దని చెప్పేశానని తెలిపింది. అంతకు ముందు మహేష్ నటించిన వంశీ, మురారి, అతడు, దూకుడు వంటి సినిమాల్లో మంచి పాత్రలే చేశానని చెప్పింది.

  • Loading...

More Telugu News