: గతంలో నా తప్పులే నన్ను ఓడించాయి తప్ప ఎవరూ ఓడించలేదు: చంద్రబాబు
తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తెలుగుదేశం నేతలతో సమావేశమైన ఆయన, ప్రజలకు మంచి చేద్దామన్న తొందర్లో గతంలో తాను కొన్ని తప్పులు చేశానని, వాటి కారణంగా ఓడిపోయానే తప్ప, మరే విధమైన కారణాలు, తనను ఓడించిన వ్యక్తులు లేరని ఆయన అన్నారు. మరో 20 సంవత్సరాల పాటు ఏపీలో అధికారం తమదేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర, సమర్థ పాలన ఎక్కడ ఉంటే, పరిశ్రమలు అక్కడికి వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం తప్పని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలూ కృషి చేస్తానని, నేతలంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.