: సీన్ మారింది.. ఆప్యాయంగా పలకరించుకున్న ఎమ్మెల్యే చింతమనేని, ఎమ్మార్వో వనజాక్షి


గతంలో ఇసుక రవాణా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని, ఎమ్మార్వో వనజాక్షిల మధ్య పెద్ద యుద్ధమే నడిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. అయితే, ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. చింతమనేని ప్రభాకర్, వనజాక్షిలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు బాల సదనం హాస్టల్ లో మేఘన అనే ఓ బాలికను ఈరోజు వనజాక్షి దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి చింతమనేని కూడా హాజరయ్యారు. ముందుగా వనజాక్షికి ఆయన స్వాగతం పలికారు. అనంతరం చింతమనేనికి వనజాక్షి పూల బొకే ఇచ్చారు. ఈ సందర్భంగా వనజాక్షి మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగానే అప్పటి గొడవ జరిగిందని... ఆ గొడవను తాము మర్చిపోయామని చెప్పారు. తామిద్దరం దాయాదులం కాదని, శత్రువులం అంతకన్నా కాదని తెలిపారు. 

  • Loading...

More Telugu News