: రాత్రి 10:30కి బాహుబలి బెనిఫిట్ షో ఉంది: ప్రసాద్ మల్టీప్లెక్స్ కౌంటర్ సిబ్బంది


నేటి రాత్రి పదిన్నర గంటలకు 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' బెనిఫిట్ షోను ప్రదర్శిస్తామని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ ధియేటర్ టికెట్ కౌంటర్ సిబ్బంది తెలిపారు. బెనిఫిట్ షోకు టికెట్లను ధియేటర్ యాజమాన్యం అమ్మలేదని వారు పేర్కొన్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన వారే ధియేటర్ ను బుక్ చేసుకున్నారని, వారే బెనిఫిట్ షోను ప్రదర్శిస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే ఎవరు బుక్ చేశారు? వంటి వివరాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. అందుకే నిబంధనలకు అనుగుణంగా రాత్రి 10:30 నిమిషాలకు  'బాహుబలి-2: ద కన్ క్లూజన్' బెనిఫిట్ షో ఉంటుందని వారు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News