: ప్రభాస్ ఎవరితో కలసి సినిమా చూసేందుకు భయపడుతున్నాడో తెలుసా?


సినీ అభిమానులంతా 'బాహుబలి-2' ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. టికెట్ రేట్లను భారీగా పెంచి అమ్ముకుంటున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. మొదటి ఆటనే చూసేయాలనే ఉత్సుకతతో ఉన్నారు. ఈ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమైపోతున్నాయి. మరోవైపు సినీ హీరో ప్రభాస్ కూడా ఈ సినిమా తొలి ఆట కోసం ఎదురు చూస్తున్నాడు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన తన తల్లి శివకుమారి ఈ సినిమాను మొదట చూడాలని ప్రభాస్ కోరుకుంటున్నాడట. అయితే, ఆమెతో కలసి సినిమా చూసేందుకు మాత్రం భయపడుతున్నాడట. ఎందుకంటే... సినిమా చూసిన తర్వాత తన తల్లి ఏం చెబుతుందనే భయంలో ప్రభాస్ ఉన్నాడట. 

  • Loading...

More Telugu News