: ఈవీఎంలలో లోపాలున్నాయన్న 'ఆప్'.. అబ్బే, అదేం లేదన్న ఆ పార్టీ మహిళా నేత!


ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ‘ఆప్’ ఓటమికి కేజ్రీవాల్ సహా పార్టీ నేతలందరూ ఈవీఎంలను తప్పుబడుతుంటే, ఒక్కరు మాత్రం అదేం లేదంటున్నారు. ఆ నేత పేరు అల్కా లాంబా. చాందినీ చౌక్ ఎమ్మెల్యే అయిన లాంబా మాట్లాడుతూ తన ప్రాంతంలో ఈవీఎంల సమస్య లేనేలేదని తేల్చి చెప్పారు.

ప్రజలు ఎన్నుకున్న వారికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని పేర్కొని కేజ్రీవాల్‌కు షాకిచ్చారు. పార్టీలో లోపాల గురించి తనకు తెలుసని, ఓటమికి బాధ్యత వహిస్తానని ఆమె పేర్కొన్నారు. ఆమె నియోజకవర్గం పరిధిలో పోటీ చేసిన ముగ్గురు ‘ఆప్’ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో స్పందించిన ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా అధికార ఆప్ రెండో స్థానికి పరిమితమైపోయింది.

  • Loading...

More Telugu News