: గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే బాహుబలి టికెట్ ఫ్రీ.. గ్యాస్ ఏజెన్సీ బంపరాఫర్!
జనాల్లో బాహుబలి ఫీవర్ ఎంతగా ఉందో చెప్పేందుకు ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ. వంట గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి బాహుబలి-2 సినిమా టికెట్‌ను ఉచితంగా ఇస్తామంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని హెచ్‌పీ గ్యాస్ డీలర్ ఇన్‌సాన్ గ్యాస్ ఏజెన్సీ బంపరాఫర్ ప్రకటించింది. అంతేకాదు ఈ విషయాన్ని తెలుపుతూ పెద్దపెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఈ నెల 30లోపు కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని మెలిక పెట్టింది. దుగ్గిరాల, రేవేంద్రపాడు గ్రామాల్లోని సినిమా హాళ్లలో ప్రదర్శితమయ్యే సినిమా టికెట్లను కనెక్షన్‌తోపాటు ఉచితంగా ఇవ్వనున్నట్టు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాస్ తెలిపారు.