: సుమారు వెయ్యి మందిని అరెస్టు చేసిన టర్కీ పోలీసులు
టర్కీ దేశాధ్యక్షుడు రిసైప్ ఎర్డగోన్ ఆదేశాల మేరకు ఆ దేశంలోని దాదాపు 72 ప్రావిన్సుల్లో సుమారు వెయ్యి మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా సైనిక కుట్రకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. అంతేగాక, ఈ చర్యకు పాల్పడుతున్న మరో రెండు వేల మంది సమాచారాన్ని కూడా ఆ దేశ ప్రభుత్వ వర్గాలు సేకరిస్తున్నాయి. అయితే, వీరంతా ఇస్లామిక్ మతపెద్ద ఫెతుల్లా గుల్లెన్‌కు సంబంధించిన మద్దతుదారులని తెలుస్తోంది. గుల్లెన్ సానుభూతిపరులు గత ఏడాది సైనిక కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మరోవైపు రాజ్యాంగ సంస్కరణ కోరుతూ ఇటీవల చేపట్టిన రెఫరెండమ్‌లో ఎర్డగోన్ విజయం సాధించారు. ఎర్డగోన్ తన వ్యతిరేకులపై ఇలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.