: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
తెలంగాణ సర్కారుకి ఈ రోజు హైకోర్టులో షాక్ తగిలింది. ఇటీవలే ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 16ను తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, దాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవోను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.