: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీ సొరంగం గుర్తింపు
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ రోజున బీఎస్ఎఫ్ అధికారులు ఓ భారీ సొరంగ మార్గాన్ని గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని దినాపుర్ జిల్లా ఫతేపూర్‌లో ఈ సొరంగ మార్గం కనిపించిందని, ఈ సొరంగం 100 మీటర్ల పొడవు ఉందని అధికారులు చెప్పారు. బంగ్లాదేశ్ వైపు నిషేధిత వస్తువులను తీసుకెళ్లడానికి స్మగ్లర్లు ఈ సొరంగాన్ని తవ్వినట్లు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.