: బాహుబలి-2 కంటే పెద్దది ఇది మాత్రమే: రామ్ గోపాల్ వర్మ


సినీ అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 'బాహుబలి-2' విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 'బాహుబలి-2' కంటే పెద్దది ఒకే ఒకటి ఉందని... అదేంటంటే పర్వతమంత ఈర్ష్య, అసూయ అని వర్మ అన్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ క్రేజ్ ను సినీ పరిశ్రమలోని ఇతరులు జీర్ణం చేసుకోలేకపోతున్నారని విమర్శించాడు. మల్టీప్లెక్స్ థియేటర్లను 'బాహుబలి-2' సింగిల్ స్క్రీన్ థియేటర్లుగా మార్చివేసిందని... ఎందుకంటే, దేశంలోని మల్టీప్లెక్స్ లలో ఉన్న అన్ని స్క్రీన్లపై ఈ సినిమా మాత్రమే ఆడబోతోందంటూ ట్వీట్ చేశాడు. 

  • Loading...

More Telugu News