: ‘జెట్ ఎయిర్ వేస్’ పైలట్ పై హర్భజన్ ఫైర్!


జెట్ ఎయిర్ వేస్ కు చెందిన పైలట్ బెర్నాడ్ హోస్లిస్ పై టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. ఈ మేరకు హర్భజన్ వరుస ట్వీట్లు చేశాడు. ‘జెట్ ఎయిర్ వేస్ పైలట్ బెర్నాడ్ హోస్టిన్.. తోటి ఇండియన్ ప్రయాణికుడిని ‘యూ బ్లడీ ఇండియన్ గెట్ అవుటాఫ్ మై ప్లైట్’ .. అంటూ దారుణంగా ప్రవర్తించాడని తన ట్వీట్ లో హర్భజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ పైలట్ జాత్యహంకారంతో ప్రవర్తించడమే కాకుండా, ఓ మహిళ పై దాడికి కూడా పాల్పడ్డాడని .. అలానే, ఓ దివ్యాంగుడిని దుర్భాషలాడాడని.. అత్యంత అవమానకరంగా, సిగ్గు చేటుగా ఆ పైలట్ ప్రవర్తించాడని అన్నాడు.

 పైలట్ బెర్నాడ్ హోస్లిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తమ దేశంలో ఇటువంటివి సహించమని .. భారతీయుడిని అయినందుకు తాను గర్వపడుతున్నానని ... ఆయా ట్వీట్లలో హర్భజన్ తెలిపాడు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం హర్భజన్ ప్రస్తావించలేదు. కాగా, ఈ ఘటనపై జెట్ ఎయిర్ వేస్ సంస్థ స్పందించింది. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని, సదరు పైలట్ పై విచారణ జరుపుతామని పేర్కొంది.

  • Loading...

More Telugu News