: భారత ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన గేట్స్నోట్స్.కామ్ (gatesnotes.com) బ్లాగ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మూడేళ్ల కిందట మోదీ స్వచ్ఛభారత్ కోసం పిలుపునిచ్చారని, ఆయన తన మాటలను చేతల్లో చూపించారని అన్నారు. 2019 కల్లా భారత్‌లో బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేయడమే ధ్యేయంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అందులో భాగంగా 7.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని, ఇది మామూలు విషయం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం తాను భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా బిల్‌గేట్స్.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై కూడా ప్రశంసలు గుప్పించారు. డిజిటల్ ఇండియాగా భారత్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కావలసిన అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు.