: వరుసగా మూడో రోజు.. తగ్గిన బంగారం ధర!


వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గింది. ఈ రోజు ట్రేడింగ్ లో రూ.250 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.29,350 కి చేరింది. అంతర్జాతీయంగా 0.02 శాతం తగ్గి సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,263.80 యూఎస్ డాలర్లుగా ఉంది. కాగా, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. రూ.600 తగ్గడంతో కిలో వెండి ధర రూ.41 వేలకు పడిపోయింది. ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో పసిడి ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయని తెలిపాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధరలు తగ్గాయని అంటున్నారు.

  • Loading...

More Telugu News