: సింధు ముందుకెళ్లింది.. సైనా వెనక్కి వచ్చేసింది


వుహాన్ లో జరుగుతున్న ఏసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన సింధు రెండో రౌండ్ లోకి అడుగుపెట్టగా... మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన సింధు అన్ సీడెడ్ క్రీడాకారిణి దినార్ (ఇండొనేషియా)పై  21-8, 21-18 తేడాతో గెలుపొందింది. చక్కటి స్మాష్ లతో విరుచుకుపడిన సింధు అరగంటలోనే మ్యాచ్ ను ముగించేసింది. మరోవైపు జపాన్ క్రీడాకారిణి సయాక సాటో చేతిలో 21-19, 16-21, 18-21 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది.

  • Loading...

More Telugu News