: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంపై స్పందించిన ప్రధాని మోదీ
ఢిల్లీ నగరపాలక సంస్థల ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు తమకు ఈ విజయాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించిన నాయకులను కూడా ఆయన ప్రశంసించారు. ఢిల్లీలోని 270 వార్డులకు ఈ నెల 23న జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ ఏకంగా 184 స్థానాల్లో విజయం సాధించింది. ఢిల్లీలో బీజేపీ నేతలు, కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.