: ఏ ప్రభుత్వంలోనూ దక్కనంత ప్రాధాన్యతను కాపులకు ఇస్తున్నాం!: చలమలశెట్టి రామానుజయ్


గతంలో ఏ ప్రభుత్వంలోనూ దక్కనంత ప్రాధాన్యత ప్రస్తుతం కాపు కులస్తులకు లభిస్తోందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కమిషన్ ఏర్పాటు చేసిందని, రాజకీయంగానూ గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత దక్కుతోందని అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం అందించామని, కాపు మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల మందికి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. సూక్ష్మ పరిశ్రమల పథకం కింద ఐదు వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామని రామానుజయ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News