: మహారాష్ట్రలో కూలిన శిక్షణా విమానం... ఇద్దరు దుర్మరణం
ఈ ఉదయం మహారాష్ట్రలోని గొండియా నేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఎఫ్టీఐ)కు చెందిన శిక్షణా విమానం డీఏ 42, ఓ చెరువులో కూలిపోయింది. ఇద్దరు పైలెట్లతో బయలుదేరిన విమానంలో సమస్య ఏర్పడగా, కాసేపటికే ఏటీఎస్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆపై గోండియా ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలోని కిరోరీ వద్ద విమానం కుప్పకూలింది. దీంతో దానిలో ప్రయాణిస్తున్న ట్రైనర్, పైలట్ ఇద్దరూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు విమానం కూలిన ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి, విచారణ చేపట్టారు.