: ఢిల్లీ విజయాన్ని అమర జవాన్లకు అంకితమిచ్చిన బీజేపీ


ఢిల్లీ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన ఘన విజయాన్ని ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల మూకుమ్మడి దాడిలో అమరులైన జవాన్లకు అంకితమిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినా, తామేమీ ఉత్సవాలను చేసుకోబోవడం లేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. సుకుమా దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను గౌరవిస్తామని తెలిపారు. ఈ ఫలితాలు తమకెంతో సంతోషాన్ని కలిగించాయని, ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారని అన్నారు. ఢిల్లీ ప్రజల నిరాదరణకు గురైన కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగుతున్న పాలనపై ఈ ఎన్నికలు రిఫరెండమని, వచ్చే ఎన్నికల్లో ఆప్ నామరూపాల్లేకుండా పోతుందని మనోజ్ తివారీ జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News