: హైదరాబాద్ రేడియో జాకీ సంధ్య సింగ్ కేసులో ఆర్మీ మేజర్ గా ఉన్న భర్తపైనే అనుమానాలు!


గత వారం హైదరాబాదులోని ఆర్మీ క్వార్టర్స్ లో ఆత్మహత్యకు పాల్పడిన రేడియో జాకీ సంధ్యా సింగ్ కేసులో ఆమె భర్త, ఆర్మీ అధికారి మేజర్ వైభవ్ విశాల్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత ఆత్మహత్యగా కేసును నమోదు చేసినప్పటికీ, సంధ్య కుటుంబ సభ్యులు వేధింపుల కేసు పెట్టడంతో వైభవ్ పేరును చేర్చినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకుని, ఆపై కట్నం కోసం వైభవ్ వేధించాడని, వాటిని తట్టుకోలేకనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వారు వాపోయారు.

కాగా, సంధ్య ఉరి వేసుకుని ఉండటాన్ని చూసి, పోలీసులకు రిపోర్టు చేసిన తరువాత, అదే రోజు రాత్రి ఒంట్లో నలతగా ఉందని చెప్పిన వైభవ్, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి మెరుగుపడగానే తమకు అప్పగిస్తామని సైనికాధికారుల నుంచి అనుమతి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వైభవ్ ను విచారిస్తేనే సంద్య మృతి వెనుక నిజానిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన వీరిద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకుని రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు.

  • Loading...

More Telugu News