: క్రికెట్ అభిమానులకు శుభవార్త... 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్థానం!


ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఆనందం కలిగించే విషయమిది. 2022లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ నూ చేర్చవచ్చని తెలుస్తోంది. కామన్వెల్త్ క్రీడలు నిర్వహించేందుకు బిడ్ దాఖలు చేయాలని బ్రిటన్ సర్కారు బర్మింగ్ హామ్ ను ఆహ్వానించింది. తొలుత ఈ హక్కులను దక్కించుకున్న దక్షిణాఫ్రికాలోని డర్బన్, రాజకీయ, ఆర్థిక కారణాలతో వెనక్కు తగ్గింది. డర్బన్ షెడ్యూల్ లో ఇప్పటికే మహిళల క్రికెట్ అంశముంది.

ఇప్పుడిక డర్బన్ స్థానంలో బర్మింగ్ హామ్ ఎంపికైతే, పురుషుల క్రికెట్‌నూ చేర్చాలని ఆలోచిస్తున్నట్టు వార్విక్‌ షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బర్మింగ్‌ హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ బిడ్‌ కంపెనీ సభ్యుడు నీల్‌ స్నోబాల్‌ తెలియజేశారు. కాగా, క్రికెట్ ను ప్రవేశపెడితే, టీ20 ఫార్మాట్ లో పోటీలు ఉంటాయి. కాగా, బర్మింగ్ హామ్ తో పాటు కెనడా, మలేసియా, ఆస్ట్రేలియాల్లోని నగరాలు సైతం 2022 కామన్వెల్త్‌ ఆతిథ్య హక్కుల కోసం పోటీ పడనున్నాయని అంచనా. 1998లో మలేసియాలో కామన్వెల్త్ క్రీడల పోటీలు జరిగినప్పుడు క్రికెట్‌ కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News