: ‘పెటా’కు కిరణ్‌బేడీ మద్దతు.. గవర్నర్ బంగళాలో మాంసాహారం నిషేధం!
ప్రభుత్వ కార్యక్రమాల్లో మాంసాహారం నిషేధించాలంటూ ‘పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా) ప్రధాని నరేంద్రమోదీకి చేసిన విజ్ఞప్తిపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ స్పందించారు. ‘పెటా’కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గవర్నర్ బంగళా (రాజ్ నివాస్)లో మాంసాహారాన్ని నిషేధించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిరణ్‌బేడీ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తమిళ ప్రజలకు ఆమె వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పెటా సంస్థకు గౌరవ సలహాదారులుగా పనిచేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏం తినాలో నిర్ణయించే హక్కు ఆమెకు లేదని, కిరణ్ బేడీ నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.