: ఉపాధ్యాయురాలి పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి... అశ్లీల చిత్రాలు పోస్టు చేశాడు.. బయటకు పొక్కడంతో ప్రాణం తీసుకున్నాడు!
నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఒక కుర్రాడి ప్రాణం తీసింది. ఆ వివరాల్లోకి వెళితే, హైదరాబాదులోని ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మార్గం సాయికుమార్ (16) చదువుతున్నాడు. హస్తినాపురం నార్త్ ఎక్స్ టెన్షన్ లోని నివాసముండే సాయికుమార్ తన పాఠశాలలోని మహిళా టీచర్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. దాని నుంచి అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తున్నాడు. ఈ విషయం అదే పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వవిద్యార్థులకు తెలిసింది.
దీంతో వారు టీచర్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశావంటూ నిలదీశారు. బెదిరించి, ఇంటర్నెట్ కేఫ్ కు తీసుకెళ్లి ఆ అకౌంట్ ను డిలీట్ చేయించి, విడిచిపెట్టారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని హెచ్చరించారు. దీంతో తాను చేసిన నిర్వాకం పాఠశాలలోను, ఇంట్లోను తెలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనతో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు, సాయికుమార్ ను బెదిరించిన ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.