: గొప్ప ఓపెనర్, ఫినిషర్ అంటూ ఉండరు...గొప్ప ఆటగాడే ఉంటాడు!: గంభీర్
టీమిండియాలో నిర్మొహమాటంగా మాట్లాడే ఆటగాడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుపై విమర్శలు చేయడం సరికాదని అన్నాడు. ఒకట్రెండు మ్యాచ్ లలో ప్రదర్శనల ఆధారంగా విమర్శలు చేయడం సరికాదని సూచించాడు. అలాగే క్రికెట్ లో బెస్ట్ ఓపెనర్ లేదా బెస్ట్ ఫినిషర్ అనే ముద్రలు ఉండవని తెలిపాడు. మ్యాచ్ లో ఎవరు బాగా ఆడారు? అన్నదే ప్రధానమని తెలిపాడు. విజయానికి కారణమైన పరుగులు చేసినవారే బెస్ట్ ఫినిషర్లు అని గంభీర్ స్పష్టం చేశాడు. ఓపెనర్ అయినా, 11వ నెంబర్ బ్యాట్స్ మన్ అయినా మ్యాచ్ విజయంలో ఎంత కీలకపాత్ర పోషించారన్నదే ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశాడు.