: అమెరికా కరాటేలో భారత్ కు 16 పతకాలు


అమెరికా వేదికగా జరిగిన కరాటే పోటీల్లో భారత కరాటే బృందం అద్భుతంగా రాణించింది. లాస్‌ వెగాస్‌ లో నిర్వహించిన యూఎస్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో భారత కరాటే బృందం ఏకంగా 16 పతకాలు సాధించి సత్తాచాటింది. ఈ 16 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు కాగా, రెండు రజత పతకాలు. మిగిలిన 11 కాంస్య పతకాలు. భారత కరాటే బృందంలో సెఫాలీ అగర్వాల్‌, అభిషేక్‌ సేన్‌ గుప్తా వేర్వేరు పోటీల్లో చెరో స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకుని దేశప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. అలాగే టీమ్ విభాగంలో కూడా భారత బృందం స్వర్ణ పతకం సాధించడం విశేషం. సెన్సెయి యశ్‌పాల్‌ సింగ్‌ కల్సీ నేతృత్వంలోని భారత బృంద సభ్యులు, అభిషేక్‌ సేన్‌ గుప్తా, రణ్‌ తేజ్‌ సింగ్‌, హర్‌ చరణ్‌ సింగ్‌ చౌహాన్‌, సెఫాలీ అగర్వాల్‌ ఆకట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News