: తగ్గిపోయిన కపిల్ షో రేటింగ్స్... శుభాకాంక్షలు చెప్పిన సునీల్ గ్రోవర్!


హిందీ బుల్లితెర స్టార్ కమెడియన్ కపిల్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కామెడీ నైట్స్ విత్ కపిల్' షో రేటింగ్స్ పడిపోయాయి. ఈ క్రమంలో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న కపిల్ శర్మ షోకు...ఆ షోను వీడిన స్టార్ కమెడియన్ సునీల్ గ్రోవర్ శుభాకాంక్షలు చెప్పాడు. అయితే మళ్లీ ఆ షోలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పాడు. అయితే కొత్తగా తాను ఏ షోలోనూ నటించడం లేదని తెలిపాడు. అలాగే ఏ ఛానెల్ తో కూడా ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశాడు. అయితే తాను బేసిగ్గా పర్ఫార్మర్ కావడంతో పనిలేకుండా ఉండలేనని, త్వరలోనే పని మొదలు పెడతానని చెప్పాడు. కపిల్ షోను మీరు వీడిన కారణంగా రేటింగ్ పడిపోయిందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఓ నవ్వు నవ్వివదిలేశాడు. 

  • Loading...

More Telugu News