: ‘గులాబీ కూలీ’లుగా మారిన కేకే, తలసాని!


టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కె. కేశవరావు(కేకే) ఈ రోజు ‘గులాబీ కూలీ’గా మారారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థులకు బోధించి రూ.2 లక్షలు, నోవా ఇంజనీరింగ్ కళాశాలలో బోధనా మెళకువలు చెప్పడం ద్వారా మరో రూ.2 లక్షలు సంపాదించారు. దీంతో పాటు, ఒహ్రిస్ హోటల్ లో తెలంగాణ బ్రాండ్ ఐస్ క్రీమ్ ను విక్రయించి ఇంకో రూ.2 లక్షలు సంపాదించారు. దీంతో, ‘గులాబీ కూలీ’గా మొత్తం రూ.6 లక్షలు సంపాదించారు.

కాగా, టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో ‘గులాబీ కూలీ’గా పని చేసి రూ.2 లక్షల 16 వేలు సంపాదించారు. ఇదిలా ఉండగా,ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించే టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ బహిరంగ సభ ఖర్చుల నిమిత్తం పార్టీకి చెందిన పలువురు నేతలు, నాయకులు ‘గులాబీ కూలీ’లుగా మారుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News