: ఎన్నికల బహిష్కరణ పిలుపుతో మావోయిస్టులు ఏమీ సాధించలేరు: ప్రజా గాయకుడు గద్దర్
ఎన్నికల బహిష్కరణ పిలుపుతో మావోయిస్టులు ఏమీ సాధించలేరని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన ఓ అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం ఆయన హన్మకొండకు వెళ్లారు. అనంతరం, మీడియాతో గద్దర్ మాట్లాడుతూ, మావోయిస్టుల పంథాను తప్పుపట్టడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయడం లేదన్నారు. ప్రజల మధ్య ఉండే నేతలను ఎన్నుకునే విధంగా బడుగు బహుజనులను చైతన్య పరిచే కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో భువనగిరిలో పది లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ‘పల్లె పల్లెకు బాట-పార్లమెంట్ కు బాట’ అనే నినాదంతో త్యాగాల కుటుంబాలను కలుస్తూ తన కొత్త పార్టీ ప్రచారం సాగిస్తానని గద్దర్ పేర్కొన్నారు.