: సెరేనా విలియమ్స్ కడుపులో బిడ్డపై కూడా జాత్యహంకార వ్యాఖ్యలు


జాత్యహంకారం విషయంలో శ్వేతజాతీయలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురుస్తున్నా, వారి వైఖరిలో మాత్రం మార్చు రావడంలేదు. అవకాశం చిక్కితే నల్లజాతీయులను ఎద్దేవా చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా అమెరికా నల్లకలువ, ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ కు అత్యంత ఆదరణ ఉన్నప్పటికీ...ఆమెకు పుట్టబోయే బిడ్డ కడుపులో ఉండగానే జాత్యహంకారాన్ని చవిచూసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెరెనా విలియమ్స్ కు పుట్టబోయే బిడ్డను ఉద్దేశించి రొమేనియాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు నస్టేజ్ ఒక సమావేశంలో మాట్లాడుతూ, ‘రంగేమిటో చూద్దాం. మిల్క్‌ విత్ చాక్లొటా?...లేక’ అని పేర్కొన్నాడు.

దీనిపై సెరెనా విలియమ్స్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె...‘మీరు మీ మాటలతో నన్ను షూట్ చేయొచ్చు....మీ ద్వేషంతో నన్ను చంపేయడానికి ప్రయత్నించవచ్చు...కానీ నేను మాత్రం గాలిలా పైకి లేస్తూనే ఉంటాన’ని ఘాటుగా సమాధానం చెప్పింది. దీంతో నస్జేజ్ వ్యాఖ్యలపై అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) దర్యాప్తుకు ఆదేశించింది. ఐటీఎఫ్ స్పందన స్వాంతన కలిగించిందని సెరెనా తెలిపింది. కాగా, సెరెనా రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహనియన్‌ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News