: నన్ను పేరు పెట్టి ఎప్పుడూ ఆయన పిలవలేదు: దర్శకుడు కె.విశ్వనాథ్


నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో కలిసి ఎక్కువ చిత్రాలు చేశానని, ఆయనెప్పుడూ, తనను పేరు పెట్టి పిలిచిన సందర్భాలు లేవని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా ప్రయాణం ఎక్కువగా ఏడిద నాగేశ్వరావుగారితోనే జరిగింది. నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు గారితో నేను నిర్మించిన చిత్రాలు బాగా వస్తాయని, ఆ విధంగా ఎలా చేయగలిగారని చాలా మంది అడిగారు. ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మాతగా..దూరంగా ఉంటారే తప్పా, అన్ని విషయాల్లో ఆయన కల్పించుకోరు. పేరు పెట్టి నన్ను ఆయన పిలవడం నేనెప్పుడూ వినలేదు. ‘ఏమండి..డైరెక్టర్ గారు’ అని ఆయన పిలుస్తారు... అందరి అభిమానం పొందగలిగాను..ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.

కాగా, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పుట్టిన తేదీ రోజునే విశ్వనాథ్ కు ఈ ప్రతిష్టాత్మక అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. 2015 అక్టోబర్ 4వ తేదీన ఏడిద మృతి చెందడం విదితమే.  

  • Loading...

More Telugu News