: కృష్ణుడు కూడా ఆనాడే కుచేలుడికి నగదురహిత రూపంలోనే సాయం చేశాడు: యూపీ సీఎం యోగి
శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడు కుచేలుడికి నగదురహిత లావాదేవీ ద్వారానే సాయం చేశాడని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో తాజాగా పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించిన ఆయన.. ఈ సందర్భంగా పురాణాల్లోని ఓ సంఘటనను తీసుకొని మరీ వివరించారు. శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇస్తాడని, అనంతరం ఇంటికి వెళ్లిన కుచేలుడు తన ఇల్లు భోగభాగ్యాలతో విలసిల్లడం చూసి విస్తుపోతాడని అన్నారు. కృష్ణుడు కూడా నగదు రూపంలో ఆయనకు సాయం చేయకుండా నగదురహిత పద్ధతినే పాటించారని ఆయన అన్నారు.