: ‘రాందేవ్‌ బాబాకు యాక్సిడెంట్’ అంటూ సోషల్ మీడియాలో వదంతులు!


యోగాగురు రాందేవ్‌ బాబాపై సామాజిక మాధ్యమాల్లో ప‌లు వ‌దంతులు షికార్లు చేస్తున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న ఓ రోడ్డు ప్ర‌మాదానికి గురై, తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని ఫేస్‌బుక్, వాట్స‌ప్‌ల‌లో వార్త‌లు వ్యాపిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఘ‌ట‌న‌లో గాయపడిన ఆయనను స్ట్రెచర్‌ మీద ఆసుప‌త్రికి తరలిస్తున్నట్టు ప‌లు ఫొటోలు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, ఈ క‌థ‌నాల‌పై స్పందించిన ఆయ‌న స‌న్నిహితులు ఇవ‌న్నీ వ‌దంతులేన‌ని కొట్టిపారేశారు. ప్రస్తుతం రాందేవ్‌ బాబా హరిద్వార్‌లో నిక్షేపంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోష‌ల్‌ మీడియాలో ఇటువంటి పుకార్లు సృష్టించార‌ని చెప్పారు. ఈ వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానంటూ రాందేవ్ బాబా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News