: అనుష్క ఆదేశించింది...కోహ్లీ శిరసావహించాడు!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రియురాలు ఆదేశించిన తరువాత ఆచరించకుండా ఉంటాడా?...ప్రియురాలి మాట వినకుండా ఉండడం ఏ ప్రియుడికైనా సాధ్యమా?...అందుకే కోహ్లీ కూడా తన ప్రియురాలి మాటను బుద్ధిమంతుడైన ప్రేమికుడిలా విన్నాడు. ఇంతకీ ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే...మొన్నామధ్య గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ కు ముందు గుజరాత్ ప్రాక్టీస్ సెషన్ వద్దకు వెళ్లిన కోహ్లీ ఆ జట్టు బౌలర్ ప్రవీణ్ కుమార్ తో రవీంద్ర జడేజా గడ్డంపై జోకులు వేసి కడుపుబ్బ నవ్విన సంగతి తెలిసిందే.  

అయితే, ఈ గడ్డంతో తాను సరికొత్త స్టైలిష్ లుక్ లో ఉన్నానంటూ రవీంద్ర జడేజా 'బ్రేక్ ద బియర్డ్స్' (సంప్రదాయ గడ్డాలను మార్చేద్దాం) అంటూ పిలుపునిచ్చాడు. దీనికి రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించి, తన గడ్డం స్టైల్ మార్చేసుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి విరాట్ కోహ్లీకి గడ్డం మార్చుకోవాలంటూ ఛాలెంజ్ విసిరారు. దీనికి స్పందించిన అనుష్క శర్మ... 'నువ్వు గడ్డం స్టైల్ మార్చుకోవద్దు'...అంటూ కోహ్లీకి సూచించింది. దీంతో కోహ్లీ తన సహచరులకు 'సారీ బాయ్స్ నేను గడ్డం స్టైల్ మార్చుకోను' అని స్పష్టం చేశాడు. మరి ప్రియురాలా? మజాకానా?  

  • Loading...

More Telugu News