: అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు
తమ ప్రభుత్వం అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... అవినీతిలో కూరుకుపోయిన అన్ని సంస్థల ఆస్తులను వేలం వేయిస్తామని అన్నారు. అంతేగాక, అంతకు ముందు ఆయా కంపెనీల యజమానులు సంపాదించుకున్న ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన అన్నారు. ప్రజలను బాధపెట్టిన వారు సంతోషంగా ఉండడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. అవినీతి చేసి డబ్బు సంపాదించిన ఏ వ్యక్తయినా పట్టుబడితే ఆ ఆస్తుల్ని బాధితులకి ఇచ్చేస్తామని, లేకపోతే ప్రజల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.