: పోలీసుల ఎదుట హాజరైన మధుసూదన్‌రెడ్డి, ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్
సోషల్ మీడియాలో పలు అభ్యంతరకర పోస్టులు పెడుతున్న ‘పొలిటికల్ పంచ్’ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని తుళ్లూరులో ఈ రోజు పోలీసులు విచారించారు. మధుసూదన్‌తో పాటు రవికిరణ్‌ను కూడా ఈ రోజు విచారించినట్లు పోలీసులు తెలిపారు. రవికిరణ్‌ను ఇప్పటికే విచారించామని అయితే, పూర్తి సమాచారం రాకపోవడంతో మరోసారి ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు.