: 'అమరేంద్ర బాహుబలి వస్తున్నాడు' అంటూ బాహుబలి టీమ్ విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ఇదే


మరో మూడు రోజుల్లో అమరేంద్ర బాహుబలి వస్తున్నాడని చెబుతూ, బాహుబలి టీమ్, సరికొత్త ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేసింది. నీలి రంగు ధోవతి, మెరూన్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, పైన ఉత్తరీయం ధరించి, తీక్షణంగా చూస్తూ వస్తున్న ప్రభాస్ చిత్రాన్ని చూపింది. అంతకుముందు మరో ట్వీట్ ను పెడుతూ, అసాధ్యమైన కష్టాలన్నీ దాటుకుని మహేంద్ర బాహుబలి మీ ముందుకు వస్తున్నాడని చెప్పింది. కేరళలో 300కు పైగా థియేటర్లలో చిత్రం విడుదల అవుతోందని, తొలిసారిగా ఆ రాష్ట్రంలో 100కు పైగా థియేటర్లలో ఉదయం 6 గంటలకే ప్రదర్శన ప్రారంభమవుతుందని కూడా పేర్కొంది.

  • Loading...

More Telugu News