: తిరుపతి అర్బన్‌ ఎస్పీపై హత్యానేరం కేసు పెట్టాలి: ఏర్పేడు ఘ‌ట‌న‌పై సీపీఐ నారాయ‌ణ ఆగ్ర‌హం


చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీపీఐ నేత నారాయ‌ణ స్పందిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ నేతలే ఇసుక మాఫియా అవతారమెత్తారని ఆరోపించారు. గతంలో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే ముఖ్య‌మంత్రి చంద్రబాబు త‌గిన‌ చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఏర్పేడు ఘటన జరిగేది కాదని ఆయ‌న వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు ఉన్న‌ ధనదాహం కార‌ణంగానే ఏర్పేడులో ఈ ఘోర ప్రమాదం జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి తిరుపతి అర్బన్‌ ఎస్పీపై హత్యానేరం కేసు పెట్టాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News