: 'ఇదో కోల్డ్ బ్లడెడ్ మర్డర్'... ప్రతీకారం తీర్చుకుంటామని రాజ్ నాథ్ శపథం


సుక్మా జిల్లాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఉదయం రాయ్ పూర్ కు వచ్చిన ఆయన, మృతదేహాలకు నివాళులు అర్పించిన ఆయన, జవాన్ల త్యాగాన్ని వృథా కానివ్వమని అన్నారు. ఈ ఘటనను ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ (క్రూరాతి క్రూరమైన హత్య) గా అభివర్ణించిన ఆయన, ప్రతీకారం తీర్చుకుని తీరుతామన్నారు. ఈ రీజియన్ లో అభివృద్ధిని అడ్డుకోవడమే నక్సల్స్ వ్యూహమని, ఇకపై తాము వామపక్ష తీవ్రవాదంపై వ్యూహాన్ని మార్చుకుంటామని చెప్పారు.

షెడ్యూల్డ్ తెగలు అధికంగా ఉన్న ప్రాంతాలపై పట్టును చూపుకునేందుకే మావోలు తెగబడ్డారని, వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలను కేంద్రం తరఫున ఆదుకుంటామని వెల్లడించిన ఆయన, మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ వెంట ఛత్తీస్ గఢ్ గవర్నర్ బలరామ్ జీ దాస్ టాండన్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్ ఆహిర్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News