: తిరిగి ప్రారంభంకానున్న ట్రంప్ టవర్ అమ్మకాలు
ముంబైలోని ఆకాశహర్మ్యం ట్రంప్ టవర్ మొత్తాన్ని 2019 నాటికి విక్రయించాలని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ లోధా గ్రూప్ ప్రకటించింది. ఈ 75 అంతస్తుల భవనంలో ఇప్పటికే 60 శాతం విక్రయాలు పూర్తయ్యాయని తెలిపింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఈ టవర్ అమ్మకాలను కొంతకాలం ఆపేశారు. దీనిపై లోధా ఎండీ అభిషేక్ లోధా మాట్లాడుతూ, ట్రంప్ గెలుపొందిన వెంటనే టవర్ మొత్తాన్ని అమ్మేయకూడదని తాము నిర్ణయించుకున్నామని... రాజకీయపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.